10 lines on Golconda fort in Telugu | గోల్కొండ కోట గురించి 10 వాక్యాలు

గోల్కొండ కోట


1) గోల్కొండ కోటను 13వ శతాబ్దంలో కాకతీయులు మట్టితో నిర్మించారు.

2) ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ సరస్సు నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3) గోల్కొండ అంటే గుండ్రని కొండ అని అర్థం. గోల్కొండను మొదట "మంకల్" అని పిలిచేవారు.

4) గోల్కొండ కోట పై నుండి చూడడానికి చాలా అందమైన దృశ్యాన్ని అందిస్తుంది.

5) ఇది 15వ శతాబ్దం నుండి కుతుబ్ షాహీ రాజవంశం యొక్క రాజధాని. ఈ సమయములోనే కాంక్రీట్‌ మేసన్రీ బ్లాక్‌ పనులు జరిగినవి.

6) ఔరంగజేబు 1687లో కుతుబ్ షాహీని పడగొట్టి గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.

7) గోల్కొండ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశము యొక్క హోదాను తాత్కాలికంగా పొందుతున్న స్మారక చిహ్నాల జాబితాలో ఉంది.

8) కోహ్-ఐ-నూర్, దరియా-ఐ-నూర్ మరియు ది హోప్ మొదలైన ప్రసిద్ధ వజ్రాలు గోల్కొండ గనుల నుండి వచ్చాయి.

9) కుతుబ్ షాహీ సుల్తానుల సమాధులు గోల్కొండ కోట వెలుపలి గోడకు ఉత్తరాన ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా అందంగా చెక్కబడిన రాతితో తయారు చేయబడినాయి, అంతేకాకుండా చుట్టూ ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటలు కూడా ఉన్నాయి.

10) ఫతే దర్వాజాను నిర్మించడానికి ధ్వనిశాస్త్రం ను ఉపయోగించారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తులో ఉన్న ప్రదేశం "బాలా హిస్సార్" వద్ద స్పష్టంగా వినబడుతుంది.


5 lines on Golconda fort in telugu | గోల్కొండ కోట గురించి 5 వాక్యాలు

1) గోల్కొండ కోట తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ సరస్సు నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.

2) 120 మీటర్లు ఎత్తయిన నల్లరాతి కొండ మీద గోల్కొండ కోటను నిర్మించారు.

3) కాకతీయులు 1083 నుంచి 1323 వరకు గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించారు.

4) గోల్కొండ కోటలో అతి ఎత్తయిన ప్రదేశము "బాలా హిస్సార్".

5) మొదట గోల్కొండను "మంకల్" అని పిలిచేవారు, గోల్కొండ అంటే గుండ్రని కొండ అని అర్థం.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు