చార్మినార్ గురించి 10 వాక్యాలు :
1) చార్మినార్ తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రాచీన కట్టడాలలో ఒకటి.
2) దీనిని 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు.
3) నాలుగు మినార్ లు కలిగిన కట్టడం కావడంతో దీనిని చార్మినార్ అని అంటారు.
4) ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి ముగింపు సందర్భంగా దీనిని నిర్మించారని కొందరి నమ్మకం.
5) భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి.
6) చార్మినార్ చతురస్రాకారంలో ఉంటుంది. దీనికి నాలుగు మినార్లు ఉంటాయి.
7) చార్మినార్‌లోని మసీదు పై అంతస్తులో ఉంటుంది. కుతుబ్ షాహీల కాలంలో మొదటి అంతస్తును మదర్సాగా ఉపయోగించారు.
8) చార్మినార్ చుట్టూ భారీ మార్కెట్ ఉంటుంది. ఈ మార్కెట్‌ను లాడ్ బజార్ అని అంటారు.
9) హైదరాబాద్ చరిత్రలో చార్మినార్‌కు ప్రముఖ స్థానం ఉంది. ఇది హైదరాబాద్‌కు చిహ్నం. దీని అందం మరియు పెద్ద ఆకట్టుకునే నిర్మాణం ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది.
10) హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతములలో చార్మినార్ కూడా ఒకటి.
0 కామెంట్లు